TG: దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని కించపరచడమే ఒక అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. మోదీలా ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధాని కాలేదు. ప్రజల మద్దతుతో నెహ్రూ ప్రధాని అయ్యారు. అబద్ధాలు చెప్పి నెహ్రూ చరిత్రను మార్చలేరు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు’ అని పేర్కొన్నారు.