ప్రయాణికులకు టికెట్ల డబ్బులు రేపు రాత్రి 8లోపు రీఫండ్ చేయాలని ఇండిగోకు ఆదేశించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, సంక్షోభంపై ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించామని.. కమిటీ నివేదిక ఆధారంగా ఇండిగోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాలని అన్నారు.