జనగామ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. జిల్లాలో మూడు విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నందున చివరి విడత ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఏకగ్రీవమైన గ్రామాల్లో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.