ఇల్లందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య జీవితం ఆధారంగా ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో బయోపిక్ రాబోతుంది. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా వేడుకలో శివన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబసభ్యులను కలిశానని, తన సొంత మనుషులను కలిసినట్లు అనిపించిందని తెలిపారు. నర్సయ్యను చూస్తుంటే తన నాన్నలా అనిపించిందని అన్నారు.