HNK: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం హనుమకొండలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను కాపాడుకుందామని, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని అన్నారు.