కృష్ణా: పెనమలూరు పరిధిలో సనత్నగర్లో పోలీసులు భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నెలలుగా అక్రమ రేషన్ వ్యాపారం నిర్వహిస్తున్న రాయుడు అనే నిందితుడు పెనమలూరు నియోజకవర్గంలో భారీగా బియ్యం దంచికొడుతున్నట్లు వెల్లడైంది. అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇస్తూ వ్యాపారం సాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.