KDP: మైదుకూరులోని ఉర్దూ స్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మైదుకూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు వనరుల కల్పనకు కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు.