MDK: పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండో విడత, మూడో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి అయింది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే పార్టీకి చెందిన పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు.