ప్రకాశం: కనిగిరి పట్టణ సీపీఎం నాయకులపై అక్రమ కేసు పెట్టి జైలు పాలు చేయడానికి నిరసిస్తూ శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఎం నాయకులపై కక్ష కట్టి పోలీస్ యంత్రాంగం కేసులు నమోదు చేయడాన్ని ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.