మాల్దీవులు పొగాకు రహిత సమాజ నిర్మాణంలో చారిత్రక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే ధూమపానాన్ని పూర్తిగా నిషేధించిన తొలి దేశంగా మాల్దీవులు నిలిచింది. జనవరి 1, 2007 తర్వాత జన్మించిన వారు పొగాకు ఉత్పత్తులను కొనడం, వాడటం పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం స్థానికులతో పాటు దేశానికి వచ్చే పర్యాటకులపై కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.