NTR: పోలీసు విభాగంలో మానవతా విలువలు, మానవీయ భావాలు ప్రతీ రోజు కొత్త ఉదాహరణలుగా మన ముందుకు వస్తూనే ఉన్నాయి. విజయవాడ ట్రాఫిక్ పోలీసులు చూపిన హృదయపూర్వక చర్య శుక్రవారం అందరినీ ఆకట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక కోతికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం ద్వారా తమలోని మానవత్వాన్ని, సమాజం పట్ల ఉన్న కర్తవ్యాన్ని మరోసారి చాటి చెప్పారు.