KMR: పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్యురాలు దివ్య సూచించారు. శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ సందర్భంగా భిక్కనూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.