W.G: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో టీచర్లు, ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆర్డీవో దాసిరాజు, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి ఇంటర్వ్యూలు చేశారు. పాలకొల్లు, పెనుమంట్ర, మొగల్తూరు సెక్టర్ పరిధిలోని 52 ఆయా పోస్టులకు 128 మంది, 2 టీచర్ పోస్టులకు 12 మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి త్వరలో సమాచారం అందిస్తామని తెలిపారు.