కోనసీమ: ప్రమాదాల నివారణ ముందస్తు చర్యలలో భాగంగా అమలాపురం పట్టణంలోని విద్యాసంస్థలకు చెందిన 21 బస్సులను రవాణాశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. బస్సులలో సాంకేతిక పరమైన లోపాలను గుర్తించి అక్కడక్కడ స్కూలు యజమాన్యానికి నోటీసులు జారీ చేశామని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోగా లోపాలను సరిచేయాలని సూచించారు.