SRD: సిర్గాపూర్‌లోని రైతు వేదిక వద్ద సర్పంచ్, వార్డు అభ్యర్థులు, బలపరిచే వ్యక్తులతో శుక్రవారం సాయంత్రం సందడి నెలకొంది. అందరూ ఒకే మారు రావడంతో గందరగోళం జరిగింది. దాంతో స్థానిక MRO కిరణ్ కుమార్, DT హేమంత్ కుమార్, MPDO శారద పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 5 లోపు వచ్చిన వారికి వరుస క్రమంలో టోకెన్లు ఇచ్చారు.