WG: స్క్రబ్ టైఫస్ అనేది చెట్ల పొదల్లో, పొలాల్లో తడి ప్రదేశాల్లో ఉండే చిన్న చిగ్గర్ (చేరెడు పురుగు) కాటు ద్వారా వచ్చే ఒక ప్రమాదకరమైన జ్వర వ్యాధి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గీత బాయ్ అన్నారు. వ్యాధి లక్షణాలపై ఇవాళ భీమవరంలో ఒక ప్రకటనలో విడుదల చేశారు. సమయానికి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని, ఆలస్యమైతే ప్రాణాపాయం కలగవచ్చునన్నారు.