KMR: బీబీపేట్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ విక్టర్ సందర్శించి తనిఖీ చేశారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ పకడ్బందీగా నిర్వహించి రైతులకు, డబ్బులు త్వరగా పడే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గంగాసాగర్ ఉన్నారు.