MDK: పంట అవశేషాలు కాల్చి వేయడం వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతాయని, తద్వారా రైతుకు నష్టం ఏర్పడుతుందని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిని దీపిక సూచించారు. మండల పరిధిలోని పలు వ్యవసాయ పొలాలను ఆమె సందర్శించారు. పంట అవశేషాలు ఎస్ ఎస్ పి, యూరియా ఉపయోగించి డీ కంపోజ్ చేయడం వల్ల భూమిలో పోషకాలు పెరుగుతాయని, తద్వారా రైతుకు లాభం చేకూరుతుందని తెలిపారు.