E.G: అత్తిలి మండలం, కొమ్మర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ 3.O కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ఆయన గణితాన్ని బోధించారు.