NGKL: వంగూరు మండలం సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నిక సమావేశానికి హాజరైన పదిమంది వార్డు మెంబర్లు వేమారెడ్డిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ అధికారి జంగయ్య ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. వేమారెడ్డి ఉపసర్పంచ్ కావడం మూడోసారి. ఇటీవల సర్పంచ్‌గా వెంకటయ్యను ఎన్నుకున్నారు.