KNR: జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల ఏకగ్రీవాల సంఖ్య పెరిగింది. చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని మొత్తం 866 వార్డులకు గాను 276 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 590 వార్డులకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.