BDK: కొత్తగూడెం జిల్లా కోర్టులో ఈనెల 21న జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్ కోరారు. రాజీ కాదగిన కేసులు ఉన్నట్లయితే కక్షిదారులు రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని, పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.