AP: సీబీఐ అధికారిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపు లేఖలు వచ్చినట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. తన రక్తం కళ్ల చూస్తామంటూ రక్తంతో లేఖలు రాసేవారని చెప్పారు. కానీ తను వాటికి భయపడలేదన్నారు. ఆ సమయంలో తనను నిలబెట్టింది భగవద్గీతేనని వెల్లడించారు. భగవద్గీత మీద నమ్మకంతో తన చేయాల్సిన కర్తవ్యాన్ని ఎలాంటి భయం లేకుండా చేసినట్లు స్పష్టం చేశారు.