MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సరైన ఆధారాలు లేని రూ. 50 వేలు మించి రవాణా చేస్తే స్వాధీనం చేసుకుంటామని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో FST, SST బృందాలతో పాటు, తహసీల్దార్లకు ఎన్నికలపై అవగాహన సమావేశం నిర్వహించారు. మద్యం, బహుమతుల పంపిణీ పై దృష్టి పెడుతున్నట్లు వివరించారు.