KNR: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీణవంకలోని చల్లూరు, హుజురాబాద్‌లోని చిన్నపాపయ్య పల్లి వంటి సమస్యాత్మక కేంద్రాలను ఆయన పరిశీలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లను సీపీ హెచ్చరించారు. ఎన్నికల నేరస్థులపై బైండోవర్ చర్యలు చేపట్టి, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.