NLG: ప్రజా పంపిణీలో అక్రమాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ రఘునందన్ హెచ్చరించారు. గురువారం మనుగోడు మండలం కిష్టపురంలో చౌక దుకాణాన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యం గిడ్డంగి నుంచి చౌక దుకాణాలకు చేరే వరకు నిఘా ఉంటుందని గుర్తు చేశారు.