KMR:పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లి సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.