AP: CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన CRDA అథారిటీ భేటీలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.7380.70 కోట్ల రుణానికి అంగీకారం లభించింది. సీడ్ యాక్సిస్ రోడ్ను హైవే- 16కు అనుసంధానించాలని.. పనులకు రూ.532 కోట్లతో టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. జనవరికల్లా సీడ్ యాక్సిస్ రోడ్ను మంగళగిరికి కలుపుతామన్నారు.