W.G: నరసాపురం స్టీమర్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్లో నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పేదలకు అందించే ఆహారం నాణ్యతతో ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వండాలని ఆయన నిర్వాహకులకు ఆదేశించారు.