W.G: పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరులో ఉన్న శిశు గృహా సంరక్షణ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా శిశు గృహ సంరక్షణలో ఉన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, దత్తత ప్రక్రియ ఎంత వరకు వచ్చింది, తదిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంరక్షణలో ఉన్న పిల్లలను శ్రద్ధగా చూడాలన్నారు.