SDPT: గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ను కాంగ్రెస్ అడ్డుకున్నట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 96% పనులు పూర్తిచేసి నీళ్లు నింపినట్లు తెలిపారు. తాము శంకుస్థాపన చేసిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేయగల సామర్ధ్యం ప్రస్తుత సీఎం వద్ద ఉందా అని ప్రశ్నించగా, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా పూర్తికాలేదని విమర్శించారు.