ATP: పుట్లూరులోని చెరువులకు నీరు, అరటి రైతులకు గిట్టుబాటు ధర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ YCP మండల అధ్యక్షుడు పొన్నాపటి మహేశ్వర్ రెడ్డి రైతులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి వినతిపత్రం అందజేశారు. సుబ్బరాయ సాగర్ డ్యాం గేట్ల మరమ్మతులు పూర్తి కాకపోవడం వల్ల చెరువులకు నీరు అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.