NLR: విడవలూరు మండలంలోని సముద్ర తీరప్రాంతాలు దిత్వా తుఫాన్ దాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఓవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలు జలమయం అవుతుంటే, సముద్రం పోటెత్తి అలలు ఉధృతంగా ఉండడంతో అలలధాటికి చలిగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్ర తీరప్రాంత ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు.