NLG: ఏబీవీపీ 71వ జాతీయ మహాసభలు నవంబర్ 28 నుంచి 30 తేదీల్లో ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగాయి. ఈ సభల్లో జాతీయ అధ్యక్షులు ప్రొ. రఘురాజ్ కిషోర్ తివారి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యవర్గంలో నల్గొండ వాసి నీతు సింగ్‌కి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా అవకాశం దక్కింది. ఆమె చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో పీజీ పూర్తి చేసింది.