AP: నెల్లూరు ఆత్మకూరులో డీడీవో కార్యాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 251 మంది లబ్ధిదారులకు గృహనిర్మాణ పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. ఆత్మకూరులో రూ.50.48 కోట్లతో అభివద్ధి పనులు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు.