ప్రకాశం: డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండటం వలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ శ్రాజాబాబు చెప్పారు. గురువారం ఒంగోలు లోని పాత జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డివిజన్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.