ప్రకాశం: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు జవహర్ నవోదయ విద్యాలయంలో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షను ఈనెల 13న నిర్వహించనున్నారు. ఉదయం 11:30 నుంచి 1:30 గంటల వరకు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. హాల్ టికెట్‌ను https://navodaya.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.