VSP: దక్షిణ నియోజకవర్గం జోన్-4లో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కలెక్టర్ హరేందర్ ప్రసాద్ సమక్షంలో ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 77 కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. పంచాయతీల అభివృద్ధే కూటమి లక్ష్యమని, గత వైసీపీ పాలనలో కార్యాలయాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే విమర్శించారు.