SKLM: ఈ సంవత్సరం ఆఖరి సూపర్ మూన్ ఈరోజు సాయంత్రం ఆవిష్కృతం కానుంది. ఈరోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత పెద్దగా, భూమికి ఇంత దగ్గరగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. చందమామ భూమికి అత్యంత దగ్గరకు రావడం వల్ల ఇది ‘పెద్ద చందమామగా’ దర్శనం ఇవ్వనుంది. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడు ఈరోజు సాయంత్రం ఆకాశంలో దర్శనం ఇవ్వనుంది.