ADB: గడిచిన 10 సంవత్సరాల బీ.ఆర్.ఎస్ పాలనలో నిరుద్యోగులను ఆ పార్టీ పట్టించుకోలేదని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.