E.G: ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ 16వ వార్డు నందు వాటర్ ఫిల్టర్ బహుకరించి, టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహారం అందించేందుకు రూ.30 వేలు ఆర్థిక సహాయ అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.