WNP: పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైద్య విద్యార్థిని కే.ఎన్. నిఖిత ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నామినేషన్ వేశానని.. గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కాగా ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలోని యువత సైతం అభినందిస్తున్నారు.