పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఇవాళ మండలం నిమ్మనపల్లిలో మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మిల్లు యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు మల్లేశంకు చెందిన 27 క్వింటాళ్ల 80 కిలోల పత్తిని మొదటి కొనుగోలుగా స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..8-12% తేమ ఉండేలా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.