NLG: ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 6న దేవరకొండకు రానున్న సందర్భంగా జరుగుతున్న సభ ఏర్పాట్లను ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్తో కలిసి పరిశీలించారు. స్థానిక నాయకులతో కలిసి బహిరంగ సభ విజయవంతంపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.