ప్రముఖ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత శ్రీ శరవణన్ కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య.. శరవణన్ భౌతికకాయానికి నివాళులర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టారు. సూర్యతో పాటు ఆయన తండ్రి శివకుమార్, తమిళనాడు CM స్టాలిన్, రజినీకాంత్, విశాల్ తదితరులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.