VZM: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా భీమిలి 4వ వార్డు మంగమారిపేటలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో ఇవాళ ఉమ్మడి విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్య, వైద్యం ప్రజల కనీస హక్కు అని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోందని అన్నారు.ఈ మేరకు కోటి సంతకాలు సేకరణ చేపట్టామన్నారు.