MBNR: ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చులను సర్పంచ్ కు రూ.2.5 లక్షల నుంచి రూ.1.5 లక్షల వరకు ఈసీ ఖరారు చేసింది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా లెక్కకు మించి భారీగా వెచ్చిస్తున్నారు. దీంతో డబ్బు ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.