TG: గత పదేళ్లలో నిరుద్యోగుల పొట్ట కొట్టిన పార్టీ బీఆర్ఎస్ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఢిల్లీ మొత్తం కాలుష్యంతో నిండిపోయిందని.. హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకూడదని హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ పాలసీ వల్ల ప్రజలకు అందుబాటులోకి భూముల ధరలు వస్తాయని చెప్పారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామన్నారు.