రాయ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఆ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత్ గడ్డపై 350 పరుగులకు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే, మొహాలీలో భారత్‌పై ఆస్ట్రేలియా ఛేదించిన 359 పరుగుల రికార్డును సౌతాఫ్రికా సమం చేసింది.