RR: షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద, ఎల్లంపల్లి, చౌలపల్లి గ్రామాల్లో పట్టణ సీఐ విజయ్ కుమార్, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఓటరు స్వేచ్ఛాయుతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని ఉద్దేశంతోనే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.